Seaplanes in Srisailam and Prakasam:ఏపీవాసులకు అదిరిపోయే వార్త.. త్వరలోనే ఏపీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, శ్రీశైలంలో ఎయిర్‌డ్రోమ్ ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇదే విషయాన్ని చర్చించారు. వారం రోజుల్లో సీ ప్లేన్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్ ఏర్పాటుపై చర్చించగా.. సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది.