తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు యూనిఫామ్ ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీసు యూనిఫాం అరటితొక్క కాదన్నారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా? అని ప్రశ్నించారు. జగన్ ఇష్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని.. కష్టపడి చదివి, పరుగు పందెంలో పాసై, వేలమంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇదని చెప్పారు. తాము నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తామని, అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్‌ను హెచ్చరించారు.