శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాద ఘటనలో కీలక పురోగతి లభించింది. కేరళ నుంచి వచ్చిన కేడావర్ డాగ్స్ మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు ఉదయం మృతదేహాన్ని గుర్తించగా.. టన్నెల్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. పూర్తిగా కుళ్లిపోయి, నుజ్జునుజ్జయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.