Somasila: ఏపీ-తెలంగాణ మధ్య పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా నదిపై గ్లాస్ బ్రిడ్జిని నిర్మించి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జిపై రోడ్డును నిర్మించి వాహనాలు వెళ్తే.. కింద పడవలు వెళ్లనున్నాయి. దీంతో పర్యాటకులకు మరింత అద్భుతమైన అనుభూతి కలగనుంది. కృష్ణా నదిలో కేవలం 2 పిల్లర్లపైనే ఈ బ్రిడ్జిని నిర్మిస్తుండటం గమనార్హం. ఈ గ్లాస్ బ్రిడ్జికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.