Sonu Sood: తిరుమల శ్రీవారి సేవలో సోనూసూద్ ఫ్యామిలీ

1 year ago 29
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు సోనూసూద్‌ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అర్చకులు సోనూసూద్‌కు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ‘నంది‘ పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అందులో తాను నటించడంతోపాటు దర్శకత్వం కూడా చేస్తున్నానన్నారు.
Read Entire Article