ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లి పాఠశాలలో సన్ షేడ్ కూలి ఓ విద్యార్థి చనిపోయాడు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు విద్యార్థి మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.