ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పుష్కలంగా వర్షాలు కురిసి.. ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆగస్టు మొదటి వారానికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం దాదాపు నిండిపోయాయి. తర్వాత కొద్ది రోజులకే శ్రీశైలం నుంచి కృష్ణా పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌కు చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టులో నిటి మట్టం గరిష్ఠానికి చేరుకుని.. ఒకసారి మొత్తం గేట్లను తెరిచారు. మళ్లీ ఎగువ నుంచి వరద రావడంతో ఇంకోసారి గేట్లను ఎత్తారు.