nara bhuvaneswari in Srisailam: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు తానొస్తున్నట్లు ఎలాంటి హడావిడి చేయవద్దంటూ పర్యటనకు ముందు నారా భువనేశ్వరి ఆలయ అధికారులకు సూచించారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి హంగామా చేయవద్దని సూచించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న భువనేశ్వరి.. మిగతా భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.