తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి మెట్టు మార్గంలోని దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు మారాయి. టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లోకి మార్చారు. శుక్రవారం నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అయితే ఇది తాత్కాలిక మార్పు మాత్రమేనని భక్తులకు టీటీడీ సూచించింది.