ఇన్నాళ్లూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఏలిన మగమహారాజులు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది ముగ్గురే ముగ్గురు ఖాన్లు. వారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. వీళ్లంతా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ.7 వేల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సినీ దిగ్గజాలు. కానీ ఇప్పుడు ఒక లేడీ సూపర్ స్టార్ వారి రికార్డులను బ్రేక్ చేసింది.