Plates cleaning in Dirty water in Anna canteen: అన్న క్యాంటీన్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తణుకు అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన ప్లేట్లను మురికి నీటిలో శుభ్రం చేస్తున్నారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మురికి నీటిలో ముంచి తిరిగి అదే ప్లేట్‌లో భోజనం వడ్డిస్తున్నారంటూ వీడియోలో ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి నారాయణ ఆరా తీశారు. తణుకు అన్న క్యాంటీన్ వీడియో వ్యవహారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే వాష్ బేసిన్‌లో ఉంచిన ప్లేట్లను బయటకు తీస్తున్న సమయంలో వీడియో తీసి వైరల్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.