TCS InQuizitive: టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ 2024 హైదరాబాద్ ఎడిషన్‌లో విజేతలుగా భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, ఆగా ఖాన్ అకాడెమీ విద్యార్థులు నిలిచారు. ప్రతిభావంతులైన దేశ విద్యార్థుల్లో మేథస్సుపరమైన ఆసక్తిని, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో 12 నగరాల్లో హై స్కూల్ విద్యార్థుల కోసం టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ నిర్వహిస్తోంది. సుమారు 25 ఏళ్లుగా ఈ క్విజ్ నిర్వహిస్తున్నారు.