ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవికి కావలి గ్రీష్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఈ స్థానాన్ని భర్తీ చేయనుంది. మరోవైపు కావలి గ్రీష్మ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకు అవకాశం ఇచ్చారు. వైసీపీ నుంచి ఎలాంటి పోటీ లేకపోవటంతో కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.