TDP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతోంది. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన వారంతా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. కొత్త నేతలు కూడా పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలోకి చేరే వారికి చంద్రబాబు ఒక కీలక నిబంధన విధించారు. అది ఆమోదిస్తేనే పార్టీలో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు.