తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. పోలింగ్ తేదీలు ఇలా ఉన్నాయి. మొదటి విడత డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, మూడో విడత డిసెంబర్ 17 ఉంటుందన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుంది. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.