Telangana: దేశ చరిత్రలోనే తొలిసారి.. వారికి కోటి ప్రమాద బీమా..

9 months ago 9
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు అని అన్నారు. ప్రజాభవన్ లో ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబానికి కోటి రూపాయల బీమా చెక్కుతో పాటు.. మరో కార్మికుడు రమేశ్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం కార్మికుల కోసం ఇంత గొప్ప ఆలోచన చేసిందని, గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం కార్మికులకు భరోసా నింపుతుందని, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని అభినందించారు.
Read Entire Article