Telangana: రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఫైనల్ పరీక్షలు పూర్తయ్యేవరకు.. స్టూడెంట్స్‌కు సాయంత్రం పూట ఉచితంగా స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షల సందర్భంగా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుండగా.. వాటికి హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం ఇచ్చే కార్యక్రమం శనివారం నుంచే అధికారులు అమల్లోకి తీసుకువచ్చారు. ఈ స్నాక్స్‌లో విద్యార్థులకు ఏమేం ఇస్తారంటే?