ఈ ఏడాది వేసవి ముందుగానే వచ్చేసింది. జనవరి నెల ముగిసినప్పటి నుంచే మొదలైపోయిందా అన్నట్టు ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఇక, మార్చి నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. దీంతో తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదు అవుతుండగా.. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు.