తాండూరు పట్టణ ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఔటర్ రింగు రోడ్డు పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి కాగా.. భూసేకరణలో జాప్యం కారణంగా 30 శాతం పనులు నిలిచిపోయాయి. రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో చిక్కుముడులు వీడుతుండటంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.