TG: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. 50 ఎకరాలకు తగ్గకుండా..

1 year ago 33
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ గోశాలలో 14 కోడెలు మరణించడం కలకలం సృష్టించింది. దీనిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. ఈ ఘటనకు రాజకీయ రంగు అంటడంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా గోశాలల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని, ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని, బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కనీసం 50 ఎకరాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని, ధార్మిక సంస్థలను భాగస్వాములను చేయాలని సూచించారు.
Read Entire Article