టీజీ రెడ్కో విద్యుత్తును పొదుపుగా వాడిన వారికి ‘తెలంగాణ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు’ అందించి సత్కరించనుంది. ప్రభుత్వం సౌర శక్తి వినియోగాన్ని, కరెంటు పొదుపు పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఈ పురస్కారాల కోసం 12 వివిధ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోపు cawards2025@gmail.com కు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి డిసెంబరులో జరిగే వేడుకల్లో బంగారు, వెండి పతకాలు అందిస్తారు. పూర్తి వివరాలు tgredco.telangana.gov.in లో చూడవచ్చు.