తెలంగాణలో అన్ని గ్రామాలకు త్వరలోనే ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ని విస్తరించటమే కాకుండా.. 20 ఎంబీ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించేందుకు ఐటీ శాఖ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే.. 8000 గ్రామాలకు నెట్‌వర్క్ అందించామని.. మరో 3000 గ్రామాలకు నెట్‌వర్క్ చేయాల్సి ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.