తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు గౌరవ వేతనాల అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రూ.6,500, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు రూ.13,000 చొప్పున గౌరవ భత్యం అందుతోంది. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు వేతనం లేదు. ఎన్నికల సంఘం సర్పంచ్ అభ్యర్థులకు రూ.2.50 లక్షల వరకు ఖర్చు పరిమితిని నిర్ణయించింది. ఎన్నికల నియమావళి అమలుకు తహశీల్దార్లను నోడల్ అధికారులుగా నియమించారు. నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థులు మూడేళ్లు పోటీకి అనర్హులు అవుతారు.