ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం, కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి చర్యలు తీసుకున్న సంస్థ ఇప్పుడు బస్సుల్లో వై-ఫై సదుపాయం కల్పించేందుకు సిద్ధమవుతోంది. లహరి ఏసీ బస్సుల్లో ఇప్పటికే ఉన్న ఈ సదుపాయాన్ని మిగతా బస్సులు, బస్టాండ్లకు విస్తరించే యోచనలో ఆర్టీసీ ఉంది. త్వరలో జరిగే సమావేశం అనంతరం దీనిపై పూర్తి స్పష్టత రానుంది.