బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. తొలి విడతలో కరీంనగర్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఈ బస్సులు నడవనున్నాయి. అయితే ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. వారు కూటా టికెట్ తీసుకోవాల్సిందే.