తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం.. మొదటి నుంచి చర్చనీయాంశంగా మారుతోంది. మహిళల కొట్లాటలు, కండక్టర్లపై దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. ఓ మహిళకు, కండక్టర్‌కు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఒక మహిళ తాను దిగాల్సిన స్టేజీ కంటే.. ముందే దిగడాన్ని కండక్టర్ నిలదీయటం ఆ వీడియోలో ఉంది.