తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఈ సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఇందుకోసం ఇటీవలే ఎస్ఎస్‌డీ టోకెన్ల సంఖ్యను పెంచామన్న ఈవో.. మరింత పెంచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల సంఖ్యను కూడా వేయికి పరిమితం చేసినట్లు చెప్పారు.