శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. అక్టోబర్ నాలుగో తేదీన ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 8న శ్రీవారి గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. మరో రెండు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సూచించారు. అలాగే గరుడసేవ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్షించారు.