తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కల్తీ జరిగిందనే ఆధారాలు లేకుండా సీఎం నేరుగా ప్రకటన ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సిట్ విచారణకు ఆదేశించిన తర్వాత ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఇదే సమయంలో కల్తీ నెయ్యితోనే లడ్డూ తయారు చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. ఆ పార్టీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రియాక్టయ్యారు. ఆ భగవంతుడే సుప్రీంకోర్టు ధర్మాసనం రూపంలో ఈ వ్యాఖ్యలు చేశారంటూ అభిప్రాయపడ్డారు.