Supreme Court Special Investigation Team: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ని పక్కన పెట్టేసి.. కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు, Food Safety and Standards Authority of India నుంచి ఓ అధికారి ఉంటారు. తిరుపతి లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.