ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ తయారీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించారని, ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా.. జంతువుల కొవ్వు వాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పారు.