తిరుమల లడ్డూ వివాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ వదిలారు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి రోజుకో ట్వీట్ వదులుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు ప్రకాష్ రాజ్. తాజాగా ఈ అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో.. ప్రకాష్ రాజ్ అదే అస్త్రంగా మరోసారి సెటైర్లు వేశారు. దయచేసి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి డిప్యూటీ సీఎం ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి మరి.