తిరుమలలో నీటి కొరతను అధిగమించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఐదు డ్యామ్‌లలో ఉన్న నీరు మరో 130 రోజులకు మాత్రమే సరిపోతుందనే అంచనాల నేపథ్యంలో.. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నీటి సరఫరా కోసం తిరుపతి మున్సిపల్ కమిషనర్, సోమశిల ప్రాజెక్టు అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చించారు. కళ్యాణి డ్యామ్ నుంచి అదనపు నీటిని సరఫరా చేసేందుకు తిరుపతి మున్సిపల్ కమిషనర్ అంగీకరించారు. అలాగే కైలాసగిరి రిజర్వాయర్ నుంచి నీటిసరఫరా కోసం తిరుపతిలో అదనపు పైప్‌లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.