TTD Eo Presents Silver Coins To Employees: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో సేవలందించాలన్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, అధికారులకు కానుకలు అందజేశారు.