Tirumala: తిరుమల వెళ్లేవారికి టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. శ్రీవారి లడ్డూల పంపిణీ విషయంలో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారని.. అధికంగా లడ్డూలు ఇవ్వడం లేదంటూ ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటంతో టీటీడీ ఏఈఓ స్పందించారు. దళారులను అరికట్టేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.