Tirumala Srivari Darshan In One Hour: టీటీడీ ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం గంటలోనే పూర్తి చేయించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఏఐ సహకారంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొత్త విధానంలో తిరుమలలో దర్శనాల అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని.. సత్ఫలితాలు వస్తే రెండు మూడు నెలల్లోనే అమలుచేస్తామని తెలిపారు. ఏఐ అందుబాటులోకి వస్తే వసతికి ఇబ్బందులు కూడా ఉండవన్నారు బీఆర్ నాయుడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.