తిరుమల శ్రీవారి దర్శనాలకు వెళ్లే భక్తులు మూడు నెలల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోంది. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసి... రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లక్కీ డిప్ నిర్వహిస్తుంది. ఈ లక్కీ డిప్ లో టికెట్లు దక్కించుకున్న వారు టీటీడీ నిర్దేశించిన సొమ్మును చెల్లించి, కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత సేవల్లో భాగంగా ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఉంటాయి.