కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారంతం వల్ల భక్తుల రాకతో సప్తగిరులు కిక్కిరిసిపోయాయి. ఇక, మెట్టు మార్గం ద్వారా కొండకు చేరుకునే భక్తుల సంఖ్య అదికంగా ఉంది. ఇక్కడ 3 వేల టోకెన్లను శనివారం కేటాయించగా.. అవన్నీ గంటల్లోనే అయిపోయాయి. దీంతో చాలా మంది భక్తులు నిరాశకు గురయ్యారు. వీరంతా సర్వ దర్శనాల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.