దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సంచలనం రేపుతోంది. పలు రాజకీయ పార్టీల నేతలు దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ వివాదం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. వైసీపీని రాజకీయంగా అంతం చేసేందుకే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్న భూమన.. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని.. లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.