ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేత మాధవీలత తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మాధవీలత రైళ్లో భజన చేసుకుంటూ తిరుమల రావటంపై విమర్శలు గుప్పించారు. భజన చేసుకోవాలంటే ఆమె ఆస్పత్రిలో చేసుకోవాలంటూ సైటైర్లు పేల్చారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఈ నేతలందరూ.. ప్రధాని మోదీతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు వస్తే ఆయనను ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు.