తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరు మారింది. శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అఫ్కాన్ సంస్థ శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చింది. తిరుపతి ప్రజల వినతుల మేరకు పేరును మార్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో చంద్రబాబు దీనికి గరుడ వారధిగా నామకరణం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గరుడ వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చింది. ఇప్పుడు మళ్లీ గరుడ వారధిగా మార్చారు.