దక్షిణ మధ్య రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చర్లపల్లి స్టేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి పలు రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అక్కడకు డైవర్ట్ చేశారు. చర్లపల్లి నుంచే ఆ రైళ్లు ప్రారంభం కానున్నాయి. అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కొన్ని రైళ్లకు మరొక ఆరునెలల పాటు స్టాప్‌లు కొనసాగించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో ఈ నెల 14 నుంచి అంటే నేటి నుంచే దశల వారీగా మొత్తం 32 రైళ్లకు వివిధ స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్ లు ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.