TTD Mobile phones and Watches Auction Donated by Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మంచి అవకాశం కల్పించింది. శ్రీవారి హుండీలలో కానుకలుగా వచ్చిన వాచీలను, మొబైల్ ఫోన్లను టీటీడీ వేలానికి ఉంచింది. ఆగస్ట్ 12, 13వ తేదీలలో వేలం నిర్వహించనున్నారు. ఆఫ్ లైన్‌లో ఈ వేలం జరుగుతుందన్న టీటీడీ.. ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలని కోరింది. అన్ని బ్రాండెండ్ మొబైల్ ఫోన్లు, వాచీలను వేలంలో ఉంచింది.