TTD: తిరుమలలో వంద శాతం ప్రక్షాళన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తిరుమలకు సంబంధించిన అన్ని విషయాలపై టీటీడీ అధికారులు, మంత్రితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 9 నెలల్లో తీసుకున్న చర్యలను చంద్రబాబు ముందు టీటీడీ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.