TTD Accepts Telangana public representatives recommendation letters: తెలంగాణ ప్రజలకు టీటీడీ శుభవార్త వినిపించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణా సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. సోమ, మంగళవారం రోజుల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అలాగే బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించారు. ఒక్కో ప్రజాప్రతినిధికి సంబంధించి ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఆ లేఖఫై 6 మందికి మించకుండా దర్శనం కల్పించనున్నారు.