నిత్య జీవితంలో మనం ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటాం. అందులోని సస్పెన్స్, థ్రిల్ ఫీలవుతూ ఉంటాం. కానీ అవే ఘటనలు మన జీవితంలో జరిగితే.. తలచుకోవడానికే భయమేస్తోంది కదూ.. అలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో చోటుచేసుకుంది. ఉండి మండలం యండగండి గ్రామంలో జరిగిన ఈ ఘటన పోలీసులకు సవాల్ విసురుతోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసును పరిష్కరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్శిల్‌లో మృతదేహం రావటంతో ప్రశాంతంగా ఉన్న పల్లె ఇప్పుడు భయం భయంగా గడుపుతోంది.