2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి. అయితే ఈ బడ్జెట్‌లో కేంద్రం బిహార్ రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఏడాదిలో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కింది. అయితే ఎన్డీఏ సర్కారులో కీలకంగా ఉన్న టీడీపీని, ఏపీని విస్మరించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2025 కేంద్ర బడ్జెట్‌లో ఏపీని దారుణంగా విస్మరించారంటూ జైరామ్ రమేష్ విమర్శించారు.