అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ విజృంభిస్తోంది. రోజూ ఏదో ఒక చోట కాల్పుల ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా విదేశీయులు అందులోనూ భారతీయులనే టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు దుండుగులు. తాజాగా, అమెరికాలో స్థిరపడిన ఏపీకి చెందిన డాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఆ దేశానికి ఎంతో సేవ చేశారు. ఈ సేవలను అక్కడ ప్రభుత్వం గుర్తించి సన్మానాలు చేసింది.