Ustaad Bhagat Singh Update: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడంటే.. అప్‌డేట్ ఇచ్చిన హరీష్ శంకర్

1 year ago 39
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో హరీష్ శంకర్‌ను సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్.. జూన్ రెండవ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చామని అన్నారు.
Read Entire Article