హైదరాబాద్‌లో యువత జన్మదిన వేడుకలు రోడ్లపై చేస్తూ, మద్యం సేవించి అరాచకం సృష్టిస్తున్నారు. ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోంది. ఉప్పల్ పోలీసులు ఇలా ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పి, కఠిన చర్యల గురించి హెచ్చరించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ధోరణిని ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత అతి చేస్తున్నారని ఆయన విమర్శించారు. కుటుంబంతో ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని సూచిస్తూ.. పోలీసులు కేసుల గురించి వార్నింగ్ ఇచ్చారు.